English | Telugu

తార‌క్ - బుచ్చిబాబు ఫిల్మ్.. ప్ర‌క‌ట‌న ఆ రోజే!?

`ఉప్పెన‌`తో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేశాడు బుచ్చిబాబు సానా. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే మ‌ర‌పురాని విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. అయితే, `ఉప్పెన‌` విడుద‌లై ఏడాది దాటినా.. ఇంకా బుచ్చిబాబు త‌దుప‌రి చిత్రంపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. చాలా కాలంగా వినిపిస్తున్న‌ట్లుగానే యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో బుచ్చి బాబు త‌న సెకండ్ డైరెక్టోరియ‌ల్ ప్లాన్ చేశాడ‌ట‌. ఇదో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ అని.. తార‌క్ ఇందులో అథ్లెట్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ని స‌మాచారం. అలాగే `పెద్ది` అనే టైటిల్ కూడా ఈ సినిమాకి స‌ర్క్యులేట్ అవుతోంది. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ పాన్ - ఇండియా మూవీకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. శ్రీ‌రామ‌నవ‌మి స్పెష‌ల్ గా ఏప్రిల్ 10న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రాబోతోంద‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే, తార‌క్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` మార్చి 25న రిలీజ్ కాబోతోంది. ఆపై విజ‌న‌రీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కించ‌నున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాతో పాటే బుచ్చిబాబు కాంబో మూవీ కూడా స‌మాంత‌రంగా షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని ఇన్ సైడ్ టాక్.